top of page
MediaFx

అప్పుడు పద్మభూషణుడు..ఇప్పుడు పద్మవిభూషణుడు..


అప్పుడు పద్మభూషణుడు.. ఇప్పుడు పద్మవిభూషణుడు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుల్లో చిరంజీవి ఒకరు. నటుడిగా వినోదం పంచుతూనే సామాజికవేత్తగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకుతో సామాన్యులకు అండగా నిలిచారు. చిరంజీవి సేవలకుగాను భారత ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ చే గౌరవించింది.. ఇప్పుడు భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ వరించింది. ఒక బౌండరీ అంటూ లేని సినీరంగంలో.. ఒక్కడై వచ్చి కొండంతగా ఎదిగి తనతోపాటు పదిమందిని పైకి తీసుకొచ్చి స్టార్‌గా నిలిచాడు ఈ చిరంజీవుడు. 150కి పైగా సినిమాలు.. పదుల సంఖ్యలో అవార్డులు.. వందలాది రివార్డులు.. వేలల్లో చార్ట్‌బస్టర్లు.. కోట్లాది అభిమానులు..ఇదీ మెగాస్టార్‌ ట్రాక్‌రికార్డ్‌. తెలుగులో తొలి పదికోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిన హీరో చిరంజీవి, తొలి 50కోట్లు కూడా మెగాస్టారే. తొలి వంద కోట్ల సినిమాలోనూ చిరంజీవి నటించారు. అంతేకాదు.. మెగాస్టార్‌ డ్యాన్సులు ప్రత్యేకం. ఇప్పటికీ ఆయన గ్రేస్‌ని మ్యాచ్‌ చేయడానికి చాలామంది హీరోలు ప్రయత్నాలు చేస్తుంటారు. చిరంజీవి గొప్ప సామాజికవేత్త కూడా. చిరంజీవి తన బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ప్రతీ ఏటా వేలాది మందికి రక్తం అందిస్తున్నారు. అంతేకాదు కరోనా సమయంలో ఆయన కరోనా క్రైసిస్‌ చారిటీ అంటూ.. CCCని స్థాపించి దాని ద్వారా సినిమా ఇండస్ట్రీలోని పేదలకు సేవలు అందించారు.మరోవైపు రాజకీయాల్లో ఉన్న సమయంలో కేంద్రమంత్రిగా ఎన్నో సేవలు అందించారు. ఇలా మెగాస్టార్‌ జీవితం అటు సినిమాలకు ఇటు సామాజిక కార్యక్రమాలకే అంకితం చేశారు. కేంద్రం ఆయన సేవలు గుర్తించి పద్మవిభూషణ్‌ అవార్డును ప్రకటించింది.చిరంజీవి అంటే కోట్లాది అభిమానుల గుండెచప్పుడు. ఇండస్ట్రీకి పెద్దన్నయ్య. ప్రభుత్వాలకు కావాల్సివాడు. సింపుల్‌గా చెప్పాలంటే అందరివాడు.



bottom of page