హైదరాబాద్, నవంబర్ 08: అటు అనంత పద్మనాభ స్వామి పుణ్యక్షేత్రం.. ఇటు ఆనందం, ఆహ్లాదం పంచుతూ రా రమ్మనే టూరిస్ట్ స్పాట్. 🌞🌴
హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న అనంతగిరికి వెళ్లాలంటే ఓ కొత్త భయం పట్టుకుంది. 🌲👣 వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో చిరుత పులుల సంచారంతో స్థానికులు, పర్యటకులు భయాందోళన చెందుతున్నారు. 🦌🚶♂️ రెండు రోజుల క్రితం పూడూరు మండలం దామగుండం అడవుల్లో, నేడు అనంతగిరి అడవిలో చిరుత సంచారం కలకల రేపింది. 🌿🚗 దామగుండం అడవుల్లో సీసీ కెమెరాకు చిరుత చిక్కింది. 📸🐾 అనంతగిరిలో రోడ్డు దాటుతుండగా స్థానికులు చిరుతను చూసి ఆందోళనకు గురయ్యారు. 🌄📢 అనంతగిరి పుణ్యక్షేత్రమే కాకుండా, టూరిస్టు స్పాట్ కూడా కావడంతో నిత్యం హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో అక్కడకు ప్రజలు వెళుతుంటారు. 🏞️✈️ ఈ నేపథ్యంలో చిరుతల సంచారం కలవరం కలిగిస్తోంది. 🚷📢
వికారాబాద్ అడవుల్లోకి చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. 🌳🦁 అడవికి దగ్గర్లోని గ్రామస్తులు రాత్రి సమయంలో, పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు అధికారులు. 🌲🐄
అనంతగిరి అడవిలోకి చిరుత రావడం మంచి పరిణామం అంటున్నారు జంతు ప్రేమికులు. 🌲🐶 అయితే అడవి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. 🌳👨🌾🌄