top of page
MediaFx

బొమ్మ అనుకుని పామును కొరికి చంపిన బుడ్డోడు..


బీహార్‌లోని గయలోని ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జముహర్ గ్రామంలో ఏడాది వయసున్న చిన్నారి తన ఇంటి టెర్రస్‌పై ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలో అటుగా మూడు అడుగుల పొడవున్న ఓ పాము వచ్చింది. పామును బొమ్మగా భావించి.. దానిని పట్టుకుని కొద్ది సేపు ఆడుకున్నాడు. అనంతరం చిన్నారి పాము మధ్య భాగాన్ని నోట్లో పెట్టుకుని నమలడం ప్రారంభించాడు. దీంతో పిల్లాడి నోట్లోని పంటి గాట్ల వల్ల పాము చనిపోయింది. ఇంతలో అక్కడి వచ్చిన చిన్నారి తల్లి అక్కడి దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చనిపోయిన పామును చూసి, దాన్ని బయటపడేసి.. చిన్నారిని ఎత్తుకుని పరుగు పరుగున స్థానిక ఆసుపత్రికి తరలించి జరిగిన విషయాన్ని వారికి వివరించారు. ఆసుపత్రి అధికారులు చిన్నారికి అన్ని రకాల పరీక్షలు చేసి మరింత షాక్‌కు గురయ్యారు. పిల్లవాడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని, ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. చిన్నారి కొరకడం వల్లనే పాము మృతి చెందిందని, చనిపోయిన పాము విషం లేనిదని, అది కాటు వేసినా ప్రమాదం ఉండదని చెప్పారు. ఇది ఎక్కువగా వర్షాకాలంలో కనిపిస్తుందని ఆసుపత్రి అధికారులు తెలిపారు.



bottom of page