top of page

ఇంకా కొలిక్కి రాని కరీంనగర్ టికెట్.. అయోమయంలో కాంగ్రెస్... 🗳️

కరీంనగర్ అసెంబ్లీ నియోజవకర్గంలో ముగ్గురు ఆశావాహులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 💪 మరోవైపు టికెట్ ఇచ్చే అవకాశం లేదని, ప్రముఖ వ్యాపార వేత్త జయపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. 🚶‍♂️

అయితే, పాత వారికి కాకుండా, కొత్త వారికి టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. 💼 కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు మాత్రమే టికెట్ ఇవ్వాలంటూ సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 🗣️🔥

కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ విషయంలో ఇంకా జాప్యమే కనబడుతుంది. 🔍 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, సిరిసిల్ల స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించలేదు.. 📍 కరీంనగర్‌లో మాత్రం కాంగ్రెస్ అశావాహుల్లో ఎక్కువ పోటీ నెలకొంది. 🏘️ మొన్నటి వరకు నలుగురు నేతలు పోటీ ఉన్నారు. 🗳️ అయితే, టికెట్ వచ్చే అవకాశం లేదని భావించిన జయపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడి.. 🚶‍♂️ గులాబీ గూటికి చేరారు. 🌷 ప్రస్తుతం కరీంనగర్ పట్టణ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు, బొమ్మకల్ సర్పంచ్ పురమల్లు శ్రీనివాస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. 🗳️ పురమల్లు శ్రీనివాస్ ఇటీవలె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 🔀 నరేందర్ రెడ్డి లేదంటే, ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు ఇవ్వాలంటున్న కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. 🤝 పార్టీ కోసం పని చేసిన వారికే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

Komentarze


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page