ఫార్చ్యూన్ ఇండియా ప్రకారం.. ఈ ఏడాది రూ.92 కోట్లు పన్ను చెల్లించాడట. ఆ తర్వాత అతడి స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నిలిచాడు. 2023-24 ఏడాదికి విజయ్ రూ.80 కోట్లు పన్నులు పే చేశాడు. ఈ ఏడాది లిస్ట్‌లో అక్షయ్ కుమార్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2022లో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా రూ. 29.5 కోట్ల పన్నులు, ఆదాయపు పన్ను శాఖ నుండి గౌరవ ధృవీకరణ పత్రాన్ని కూడా అందుకున్నాడు. ఇక ఈ ఏడాది మాత్రం అక్షయ్ కుమార్ నటించిన చిత్రాలన్ని డిజాస్టర్స్ అయ్యాయి. అదే సమయంలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్, డంకీ చిత్రాలు హిట్టయ్యాయి. 2024లో అత్యధికంగా పన్నులు చెల్లించిన టాప్ ఇండియన్ సెలబ్రెటీలు.. 1. షారుఖ్ ఖాన్ – రూ. 92 కోట్లు 2. దళపతి విజయ్ – రూ. 80 కోట్లు
3. సల్మాన్ ఖాన్ – రూ. 75 కోట్లు
4. అమితాబ్ బచ్చన్ – రూ. 71 కోట్లు
5. విరాట్ కోహ్లీ – రూ. 66 కోట్లు
6. అజయ్ దేవగన్ – రూ. 42 కోట్లు
7. MS ధోని – రూ. 38 కోట్లు
8. రణబీర్ కపూర్ – రూ. 36 కోట్లు
9. సచిన్ టెండూల్కర్ – రూ. 28 కోట్లు
10. హృతిక్ రోషన్ – రూ. 28 కోట్లు
11. కపిల్ శర్మ – రూ. 26 కోట్లు
12. సౌరవ్ గంగూలీ – రూ. 23 కోట్లు
13. కరీనా కపూర్ – రూ. 20 కోట్లు
14. షాహిద్ కపూర్ – రూ. 14 కోట్లు
15. మోహన్ లాల్ – రూ. 14 కోట్లు
16. అల్లు అర్జున్ – రూ. 14 కోట్లు
17. హార్దిక్ పాండ్యా – రూ. 13 కోట్లు
18. కియారా అద్వానీ – రూ. 12 కోట్లు
19. కత్రినా కైఫ్ – రూ. 11 కోట్లు
20. పంకజ్ త్రిపాఠి – రూ. 11 కోట్లు
21. అమీర్ ఖాన్ – రూ. 10 కోట్లు
22. రిషబ్ పంత్ – రూ. 10 కోట్లు