top of page
Shiva YT

🌐 తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..💼💵

రాష్ట్ర మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లుగా ప్రభుత్వం శ్వేత పత్రంలో వెల్లడించింది. 2014-15లో రూ.72,658 కోట్లుగా ఉన్న రాష్ట్రాన్ని రూ.6 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయేలా చేశారని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

అన్ని వాస్తవాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే, 2014లో రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉండి, దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిందని తేలినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 💬📉

తెలంగాణ మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు 2014-15 నాటికి రాష్ట్ర రుణం రూ.72,658 కోట్లు 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో 24.5 శాతం పెరిగిన అప్పు 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లు 2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం 2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ.4.98 లక్షల కోట్ల వ్యయం రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం📊

bottom of page