top of page
Suresh D

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం - ఏపీ, తెలంగాణ నుంచి ఎంపికైన వాళ్లు వీరే🙌🎖️

పలు రంగాల్లో విశేష సేవలను అందించినవారికి భారత ప్రభుత్వం గురువారం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.🙌🎖️

గణతంత్ర దినోత్సవం వేళ గురువారం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా… ఇందులో 110 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. ఐదుగురికి పద్మ విభూషణ్‌ ప్రకటించగా… ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ హీరో చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్లు ఉన్నాయి. తమిళనాడు నుంచి వైజయంతి మాల బాలికి కూడా పద్మవిభూషణ్ దక్కింది. మరో 17 మందిని పద్మభూషణ్‌ అవార్డులు వరించాయి. ఇక తమిళనాడుకు చెందిన హీరో విజయ్ కాంత్ కు కళల విభాగంలో పద్మభూషణ్ అవార్డు దక్కింది.

పద్మవిభూషణ్ అవార్డులు:
  1. వైజయంతి మాల బాలి (కళారంగం)- తమిళనాడు.

  2. కొణిదెల చిరంజీవి (కళారంగం)- ఆంధ్రప్రదేశ్‌.

  3. వెంకయ్యనాయుడు ( పబ్లిక్ ఎఫైర్స్)- ఆంధ్రప్రదేశ్‌.

  4. బిందేశ్వర్‌ పాఠక్‌ ( సామాజిక సేవ)- బీహార్‌.

  5. పద్మ సుబ్రమణ్యం ( కళారంగం)- తమిళనాడు.

పద్మభూషణ్ అవార్డులు 2024:
  1. ఫాతిమా బీవి - కేరళ

  2. హర్ ముస్జీ ఎన్ కామా - మహారాష్ట్ర

  3. మిథున్ చక్రబొర్తి - పశ్చిమబెంగాల్

  4. సీతారామ్ జిందాల్ - కర్నాటక

  5. యంగ్ లియూ - తైవాన్(వ్యాపార రంగం)

  6. అశ్విని బాలచందర్ మోహత- మహారాష్ట్ర

  7. సత్యబ్రత ముఖర్జీ - పశ్చిమ బెంగాల్

  8. రామ్ నాయక్ - మహారాష్ట్ర

  9. తేజస్ మధుసుదన్ పటేల్ - గుజరాత్

  10. రాజగోపాల్ - కేరళ

  11. రిన్ పోచే - లద్దాఖ్

  12. ప్యారీలాల్ శర్మ - మహారాష్ట్ర

  13. ప్రసాద్ ఠాకూర్ - బీహార్

  14. ఉషా ఉత్తప్ - బెంగాల్

  15. విజయకాంత్ - తమిళనాడు(కళలు)

  16. కుందన్ వ్యాస్ - మహారాష్ట్ర

  17. అంబదాస్ రాజ్ దత్త్ - మహారాష్ట్ర

పద్మ శ్రీ అవార్డులు :

-ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ.

-నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి దాసరి కొండప్పకు(బుర్ర వీణ వాయిద్యకారుడు) పద్మశ్రీ.

-తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ.

-తెలంగాణకు చెందిన కేతావత్ సోమ్ లాల్(సాహిత్యం)కు పద్మ శ్రీ అవార్డు దక్కింది,

-కళల విభాగంలో ఆనందా చారి (తెలంగాణ)కి పద్మ శ్రీ అవార్డు దక్కింది.

-సాహిత్యం విభాగంలో నల్గొండ జిల్లాకు చెందిన కూరెళ్ల విఠలాచార్యకు పద్మ శ్రీ దక్కింది.

-పార్వతి బారువా(అస్సాం) భారతదేశపు తొలి మహిళా ఏనుగు మావిటి. జంతు సంరక్షణలో చేసిన కృష్టికి అవార్డును ప్రకటించారు.

- జగేశ్వర్ యాదవ్(ఛత్తీస్ ఘడ్) అట్టడుగున ఉన్న బిర్హోర్, పహాడీ కోర్వా గిరిజన తెగ ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేశారు.

- చార్మీ ముర్ము(జార్ఖండ్) సెరైకెలా ఖర్సావాన్ ప్రాంతానికి చెందిన గిరిజన పర్యావరణవేత్త. 30 లక్షల మొక్కలను నాటేందుకు కృషి చేశారు.

గుర్విందర్ సింగ్(హర్యానా) నిరాశ్రయులైన, నిరుపేదలు, మహిళలు, అనాథలు, దివ్యాంగుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. బాల్ గోపాల్ దామ్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

-సత్యనారాయణ బేలేరి(కేరళ) కాసరగోడ్‌కు చెందిన రైతు. సంప్రదాయ వరి రకాలను సంరక్షించటంలో పేరు గాంచారు.

- సంగంకిమా(పశ్చిమ బెంగాల్) ఐజ్వాల్‌కు చెందిన సామాజిక కార్యకర్త.

-కె చెల్లమ్మాళ్- దక్షిణ అండమాన్‌కు చెందిన ఆర్గానిక్ రైతు. సేంద్రియ వ్యవసాయాన్ని విజయవంతంగా అభివృద్ధి చేశారు. 5 దశాబాద్ధాలుగా సేంద్రియ వ్యవసాయ రంగంలో కృషి చేస్తున్నారు.

కళల విభాగంలో చూస్తే…. జానకీలాల్‌ (రాజస్థాన్‌), గోపీనాథ్‌ స్వైన్‌ (ఒడిశా), స్మృతి రేఖ ఛక్మా - త్రిపుర, ఓంప్రకాశ్‌ శర్మ - మధ్యప్రదేశ్‌,భద్రప్పన్‌ - తమిళనాడు,రతన్‌ కహార్‌ - పశ్చిమ బెంగాల్‌, నారాయణన్‌ - కేరళ, భాగబత్‌ పదాన్‌ - ఒడిశా, జోర్డాన్‌ లేప్చా - సిక్కిం, మచిహన్‌ సాసా - మణిపుర్‌, బాలకృష్ణన్‌ సాధనమ్‌ పుథియ వీతిల్‌ - కేరళ, శాంతిదేవీ పాసవాన్‌, శివన్‌ పాసవాన్‌ - బిహార్‌, అశోక్‌ కుమార్‌ బిశ్వాస్‌ - బిహార్‌, బాబూ రామ్‌యాదవ్‌ - ఉత్తర్‌ప్రదేశ్‌. నేపాల్‌ చంద్ర సూత్రధార్‌ - (పశ్చిమ బెంగాల్‌)ను పద్మ శ్రీ అవార్డులు వరించాయి. క్రీడా విభాగంలో మహాారాష్ట్రకు చెందిన ఉదయ్‌ విశ్వనాథ్‌ దేశ్‌పాండేకు పద్మ శ్రీ అవార్డను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వైద్య విభాగంలో…. హేమచంద్‌ మాంఝీ - ఛత్తీస్‌గఢ్‌,ప్రేమ ధన్‌రాజ్‌ - కర్ణాటక, యజ్దీ మాణెక్‌ షా( గుజరాత్‌)కు అవార్డు దక్కింది. ఈ ఏడాదికిగాను మొత్తం 110 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. గత ఏడాది(2013)లో చూస్తే…. 6 మందికి పద్మ విభూషణ్ (Padma Vibhushan), 9 మందికి పద్మ భూషణ్, 91 మందికి పద్మ శ్రీ పురస్కారం అందజేసింది కేంద్రప్రభుత్వం.

bottom of page