top of page

మార్కెట్లో ఉత్తమమైన స్మార్ట్‌ వాచ్‌లు ఏవో తెలుసా..? 🤔

ప్రస్తుత మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ వాచ్‌లు వస్తున్నాయి. రకరకాల ఫీచర్స్‌తో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక కొన్ని వాచ్‌లు అయితే వాటర్‌ ఫ్రూప్‌తో వస్తున్నాయి. ఇలాంటి వాచ్‌లు స్వి్మ్మింగ్‌కు వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటాయి. అద్భుతమైన ఫీచర్స్‌తో వాటర్‌ఫ్రూప్‌ స్మార్ట్‌ వాచ్‌లు వస్తున్నాయి. కొన్ని కంపెనీలు నీటిలో ఎంతసేపు ఉన్నా ఎలాంటి సమస్య లేకుండా ఉంటున్నాయి. మరి మార్కెట్లో ఉత్తమమైన 5 వాచ్‌లు ఏంటో తెలుసుకుందాం..

Apple Watch Ultra 2: మొదటి వాచ్ పేరు Apple Watch Ultra 2. ఇది watchOS 10 పై నడుస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ నిర్మాణం టైటానియం కేస్‌లో ప్యాక్‌తో ఉంటుంది. అన్ని రకాల ఫీచర్స్‌ ఉంటాయి. ఇది రీ-డిజైన్ చేయబడిన యాప్‌లు, కొత్త స్మార్ట్ స్టాక్, కొత్త సైక్లింగ్ అనుభవం, అవుట్‌డోర్ డిటెక్షన్ ఫీచర్‌లు, కొత్త వాచ్ ఫేస్ – మాడ్యులర్ అల్ట్రాని పొందుతుంది. ఆపిల్ వాచ్ అల్ట్రా 2 సాధారణ వినియోగంతో గరిష్టంగా 36 గంటల బ్యాటరీ జీవితాన్ని, తక్కువ పవర్ మోడ్‌లో 72 గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. ఈ వాచ్ ధర రూ.89, 899.

నాయిస్ కలర్ ఫిర్ పల్స్ గ్రాండ్: ఈ వాచ్ 1.69 అంగుళాల LCD టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో 60 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఇది హృదయ స్పందన రేటు, SpO2ని పర్యవేక్షించడంలో సహాయపడుతుంది. ఈ వాచ్‌ NoiseFit యాప్ సహాయంతో పని చేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు వారి ఫిట్‌నెస్‌ని ట్రాక్ చేయవచ్చు. నాయిస్ కలర్ ఫిర్ పల్స్ గ్రాండ్ ధర గురించి చెప్పాలంటే, దీనిని అమెజాన్ నుండి రూ. 1199కి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, నాయిస్ వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఆలివ్ గ్రీన్, షాంపైన్ గ్రే, ఎలక్ట్రిక్ బ్లూ మరియు జెట్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి.

వెర్వ్ కనెక్ట్ అల్ట్రా వాచ్ వెర్వ్: కనెక్ట్ అల్ట్రా 1.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఆల్వేస్-ఆన్ ఫీచర్‌తో వస్తుంది. మీరు అన్ని ప్రాథమిక ఫిట్‌నెస్, ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్‌లను పొందుతారు. వాచ్‌లో స్లీప్ ప్యాటర్న్ ట్రాకర్, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ సెన్సార్ ఉన్నాయి. ఇది కాకుండా, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, హైకింగ్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్ వంటి 120 కంటే ఎక్కువ క్రీడలు, వ్యాయామ మోడ్‌లు కూడా ఉన్నాయి. ఈ విధంగా మీరు మీ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ని సులభంగా అంచనా వేయవచ్చు. మీరు ఈ వాచ్‌ని అమెజాన్ నుండి 899 రూపాయలకే పొందవచ్చు.

పెబుల్ కాస్మోస్ ఎండ్యూర్: ఈ వాచ్ 1.46 అంగుళాల AMOLED స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్ కూడా ఉంది. IP68 రేటింగ్ కూడా ఉంది. ఇది నీటి నుండి రక్షించడంలో చాలా సహాయపడుతుంది. దీనిలో మీరు మూడు రంగుల ఎంపికలను పొందుతారు. అవి నీలం, ఆకుపచ్చ, నలుపు. అమెజాన్‌లో దీని ధర రూ.4, 799. ఇది స్లిపింగ్‌ ట్రాక్‌, రక్తపోటును అంచనా వేస్తుంది. వాచ్ గుండ్రని ఆకారం డిజిటల్, సాధారణ మోడల్‌లో ఉంటుంది. అంతేకాకుండా మీకు ఒక సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది.

Komentarze


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page