top of page
Suresh D

గుజరాత్‏లో ఘనంగా జరిగిన 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌వేడుక..🎥🏆

ప్రతిష్టాత్మక 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2024 వేడుక గుజరాత్‏లో అట్టహాసంగా జరిగింది..ఈ వేడుకకు బాలీవుడ్‌ తారలు హాజరై సందడి చేశారు.ఈ ఏడాదికిగాను బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌కపూర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా, అలియాభట్‌ ఉత్తమ నటిగా నిలిచింది.🎥🏆

ప్రతిష్టాత్మక 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2024 వేడుక గుజరాత్‏లో అట్టహాసంగా జరిగింది..ఈ వేడుకకు బాలీవుడ్‌ తారలు హాజరై సందడి చేశారు.ఈ ఏడాదికిగాను బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌కపూర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా, అలియాభట్‌ ఉత్తమ నటిగా నిలిచింది. రీసెంట్​గా రిలీజై బ్లాక్​బస్టర్ హిట్​గా నిలిచిన 12th ఫెయిల్‌ ఉత్తమ సినిమాగా నిలిచింది. 69వ ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్ టెక్నికల్ విభాగంలో ‘యానిమల్’, ‘జవాన్’, ‘సామ్ బహదూర్’ సినిమాలు మెరిసాయి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ – డైరెక్టర్ సందీప్ రెడ్డి కాంబినేషనల్ లో తెరకెక్కిన ‘యానిమల్’ చిత్రానికి రెండు అవార్డులు వచ్చాయి. బెస్ట్‌ యాక్టర్‌ రణబీర్‌ కపూర్‌ను అవార్డు వరించగా, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ క్యాటగిరీలో మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ను అవార్డు వరించింది..విధు వినోద్ చోప్రా రూపొందించిన ’12త్ ఫెయిల్’ మూవీ ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో అవార్డ్ గెలుచుకుంది.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ – డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన ‘జవాన్’ సినిమా బెస్ట్ యాక్షన్ & బెస్ట్ VFX క్యాటగిరీలలో అవార్డులు సాధించింది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘సామ్ బహదూర్’ సినిమా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ & బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ సహా మూడు అవార్డులు దక్కించుకుంది. ఇక ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ సినిమాలోని ‘వాట్ ఝుమ్కా’ సాంగ్ కు డ్యాన్స్ కంపోజ్ చేసిన గణేష్ ఆచార్య మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా బ్లాక్ లేడీని గెలుచుకున్నారు. ఇదే సినిమాకుగాను ఉత్తమ నటిగా ఆలియా అవార్డు అందుకుంది..

ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ తారలు రణబీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ సహా మరెంతో మంది స్టార్స్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తారలు ఇచ్చిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ వేడుకకు కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా, మనీష్ పాల్ వంటి సినీ ప్రముఖులు హోస్ట్‌లుగా వ్యవహరించారు.. సింగర్ పార్థివ్ గోహిల్ పవర్ ప్యాక్డ్ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో ఈ ఈవెంట్ ఘనంగా ముగిసింది.🎥🏆

bottom of page