top of page
MediaFx

ఈ సినిమా టైటిల్‌కి స్ఫూర్తి ఎవరో తెల్సా..?


‘గబ్బర్‌ సింగ్‌’ పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేసిన చిత్రం. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల సునామి క్రియేట్ చేసింది. డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్‌ను చూపించిన విధానానికి.. పవర్ స్టార్ చెప్పిన డైలాగ్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. . 2012 మే 11న రిలీజ్ అయిన ఈ సినిమా 12 ఏళ్లు కంప్లీట్ చేసింది. ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…

ఈ సినిమాలోని హీరో పాత్ర పేరు వెంకటరత్నం నాయుడు అయినా… అందరూ ‘గబ్బర్‌ సింగ్‌’ పిలుస్తుంటారు. ఈ పేరు పెట్టడానికి రీజన్.. ఒకప్పుడు ఓల్డ్‌ సిటీలో ఉన్న ఓ పోలీసు ఆఫీసర్. అప్పట్లో అందరూ ఆయన్ను గబ్బర్‌ సింగ్‌ అని అంటుంటేడారు అట. ఆయన్ను పవన్ చూశారు కానీ పరిచయం లేదట. ఆ పేరు చాలా నచ్చడంతో..  గబ్బర్‌ సింగ్‌’ ఫిక్స్ అయినట్లు గతంలో పవన్ వివరించారు.

ఈ సినిమాలోని ఓ సీన్‌లో పవన్‌ స్థానంలో డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ మెరిశారు.  ఈ విషయం చాలామందికి తెలియదు. ఐటమ్ సాంగ్ ‘కెవ్వుకేక’ కంప్లీట్ అవ్వగానే చెక్‌ పోస్ట్‌ వద్ద సీన్‌ ఒకటుంది. ఒక్క సెకన్ పాటు కనిపించే ఆ షాట్‌లోనే హరీశ్‌ కనిపిస్తారు. బాగా పరిశీలిస్తే కానీ హరీశ్‌ను గుర్తించలేం. అప్పటికి వరుస ప్లాఫ్స్ ఎదుర్కొంటూ.. కొందరు ఐరన్ లెగ్ అని పిలుస్తోన్న శ్రుతి హాసన్‌ను హీరోయిన్‌గా ఫైనల్ చేసి, పవన్‌ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలో పోలీసు పాత్ర ఎలా ఉండాలో పవనే డిసైడ్ చేశారట. ఇందులో హీరో ప్రొఫెషన్ పట్ల నిబద్ధతతో ఉన్నా… డ్రెస్సింగ్‌ స్టైల్‌, బిహేవియర్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. గబ్బర్ సింగ్ మూవీ 306 సెంటర్లలో 50 రోజులకుపైగా, 65 కేంద్రాల్లో 100 రోజులకుపైగా రన్ అయ్యి రికార్డు క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమా కంటే ముందు పవన్‌కు హరీశ్‌ ఓ స్టోరీ లైన్ చెప్పారట. దానికి ‘రొమాంటిక్‌ రిషి’ అనే నేమ్ కూడా ఫిక్స్ చేశారు. కానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. అదే స్టోరీ.. రవితేజ హీరోగా వచ్చిన ‘మిరపకాయ్‌’.


bottom of page