top of page
MediaFx

ఆ హీరోతో క్లోజ్‌గా మూవ్ అయిన స్నేహ.. ఆమె పై దర్శకుడు దాడి.?


ప్రేక్షకులను అలరిస్తున్న స్నేహ. అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి, అలాగే రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాల్లో నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే తాజాగా స్నేహ కు సంబందించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. హీరోతో క్లోజ్ గా ఉందని ఓ దర్శకుడు ఆమె‌ను కొట్టాడట.. దర్శకుడు దాడి చేయడంతో స్నేహాకు చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయట. అయితే ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదట.. అసలు విషయం ఏంటంటే.. సుశీ గణేషన్ అనే దర్శకుడు ఎన్నో సుమిత్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే సుశీ గణేషన్.. హీరోయిన్ స్నేహ పై దాడి చేశాడట. ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్ లో వైరల్ గా మారింది. సుశీ గణేషన్ దర్శకత్వంలో స్నేహ చాలా సినిమాల్లో నటించారు. అప్పట్లో ఆయన స్నేహాను ప్రేమించారని కూడా టాక్ ఉండేది. హీరోయిన్ గా పాపులర్ అయిన తర్వాత సుశీ గణేషన్ ను స్నేహ పట్టించుకోవడం మానేశారట. అదే సమయంలో హీరో ప్రశాంత్ తో స్నేహ క్లోజ్ గా ఉండటంతో.. అది నచ్చక సుశీ గణేషన్.. స్నేహ పై దాడి చేశారట.. ఈ దాడిలో స్నేహ కు చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయట. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు హాస్పటల్ లో చేర్పించారట. ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియదు కానీ కోలీవుడ్ లో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇక స్నేహ తమిళ నటుడు ప్ర‌సన్నను  ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహ ..రెగ్యులర్ గా తన ఫోటోలు, తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.




bottom of page