top of page

హైదరాబాద్‌ విజయంలో మరో ఘనత చేరింది

లండన్‌లోని 'ది గ్రీన్ ఆర్గనైజేషన్' సంస్థ నిర్వహించిన 'ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డ్స్'లో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం ఐదు 'గ్రీన్ యాపిల్ అవార్డులను' గెలుచుకుంది.

ఈ అవార్డులు పట్టణ మరియు రియల్ ఎస్టేట్ రంగాలలో అత్యుత్తమ విజయాలను గుర్తిస్తాయి. తెలంగాణ రాష్ట్రం వివిధ భవనాలకు అవార్డులను అందుకుంది: అద్భుతమైన పునరుద్ధరణ మరియు పునర్వినియోగంకుగాను మోజ్‌జామ్‌జాహీ మార్కెట్ (హెరిటేజ్ కేటగిరీ), ప్రత్యేక డిజైన్కు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్(వంతెన వర్గం), సౌందర్యంగా రూపొందించిన కార్యాలయ / కార్యస్థలం కేటగిరిలో ( బిల్డింగ్ కేటగిరీ) డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం , ప్రత్యేక కార్యాలయ సెటప్ కు గాను రాష్ట్ర పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇంకా అద్భుతమైన మతపరమైన నిర్మాణానికి యాదగిరిగుట్ట ఆలయం ఈ అవార్డ్స్ ను పొందాయి. గ్రీన్ ఆర్గనైజేషన్, 1994లో లండన్‌లో స్థాపించబడింది, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉత్తమ పద్ధతులను గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం నుండి ఏదైనా భవనం లేదా నిర్మాణం ప్రతిష్టాత్మకమైన గ్రీన్ యాపిల్ అవార్డులను అందుకోవడం ఇదే మొదటిసారి మరియు మొత్తం ఐదు అవార్డులను హైదరాబాద్ అందుకోవడం విశేషం.

ఈ అవార్డుల ప్రదానోత్సవం జూన్ 16న లండన్‌లో జరగనుంది. తెలంగాణ తరపున అవార్డులు అందుకోవడానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రానికి వివిధ విభాగాల్లో ఐదు అవార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు, ప్రత్యేకించి భారతీయ భవనాలు ఈ అవార్డులతో గుర్తింపు పొందడం ఇదే తొలిసారి. ఈ విజయం ఆర్కిటెక్చరల్ డిజైన్‌లో ముందుచూపుతో కూడిన విధానాన్ని హైలైట్ చేస్తుందని మరియు హైదరాబాద్ ,తెలంగాణలోని రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page