top of page
MediaFx

ఆది శేషుడు విష్ణు శేషతల్పంగా ఎలా మారాడో తెలుసా..!

హిందువులు ప్రకృతిలోని ప్రతి జీవిలో దైవాన్ని చూస్తారు. పాము, కుక్క, నెమలి, ఆవు ఇలా ప్రతి జీవిని పూజిస్తారు. అలాంటి జీవుల్లో ఒకటి పాము. హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శయనించే శేషతల్పమే ఆదిశేషుడు. సర్పాలకు ఆద్యుడు. ఆది శేషుడు వేయి పడగలను కలిగి ఉన్నాడు. తన పడగలపై గ్రహాలతో సహా సమస్త భూమండల బరువును మోస్తున్నాడు. విశ్వం సృష్టి, విధ్వంసంలో శేషుడికి ప్రత్యేక పాత్ర ఉంది. ఆది శేషుడు అవతారాల వర్ణనలు మహాభారతం, రామాయణం సహా అనేక ఇతర పురాణాలలో కూడా కనిపిస్తాయి.

శేషనాగ జననం బ్రహ్మా మానస కుమారుడు ప్రజాపతి కశ్యపుడికి ఇద్దరు భార్యలు కద్రూ, వినతలు. కద్రుడు తనంత ప్రకాశవంతంగా వెయ్యి పాములకు జన్మనిచ్చే వరం కోరగా, వినత ఇద్దరు బలవంతులైన పుత్రులకు జన్మనిచ్చే వరాన్ని కోరింది. పాములలో శేషనాగుడు మొదట జన్మించాడు. వినతకు ఇద్దరు పక్షులు జన్మించాయి.

తన తల్లి, సోదరులను విడిచిపెట్టిన శేషనాగుడు గంధమాదన పర్వతంపై కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని సంతోషపెట్టాడు. బ్రహ్మదేవుడు అతనికి, నీవు విష్ణువు నామం నుంచి ఎప్పటికీ వైదొలగవని, నిరంతరం కదిలే భూమిని నీ పడగలపై మోసే అదృష్టం దక్కుతుందని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి శేషనాగుడు భూమిని తన పడగపై మోస్తూ ఉన్నాడు.

శేషనాగుడు తన తల్లి పేరు కద్రు అయినందున, ఇతనిని కద్రునందన్ అని కూడా పిలుస్తారు. ఇతర మత గ్రంథాల్లో వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు వంటి పాముల ప్రస్తావన ఉంది. వీరంతా ఆది శేషుడు తమ్ముళ్లు. మహాభారతం ప్రకారం శేషనాగుడు త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా అవతరించాడు.


bottom of page