top of page
MediaFx

ఇంత బిజీగా ఉన్నా కూడా తమన్ స్పెషల్ ఈవెంట్..🎶🌟

సౌత్‌లో ప్రస్తుతం తమన్ క్రేజ్ బాగా పెరిగింది. సౌత్ నుంచే ప్యాన్ ఇండియన్ ప్రాజెక్టులను డీల్ చేస్తున్నాడు. తెలుగులో టాప్ స్టార్లందరికీ తమన్ సంగీతం కొడుతూనే ఉన్నాడు. కోలీవుడ్‌లో విజయ్ వంటి హీరోకి కూడా తమన్ బీట్స్ అందిస్తున్నాడు. ప్రస్తుతం తమన్ ఎంత బిజీగా ఉన్నాడని చెప్పాల్సిన పని లేదు. చేతి నిండా ప్రాజెక్టులున్నాయి. ప్రాజెక్ట్‌ల మీద ప్రాజెక్టులు తమన్ ఖాతాలోకి వస్తున్నాయి. కొన్నింటికి తమన్ కొట్టలేక చేతులెత్తేస్తున్నాడు కూడా.అయితే తమన్ ఎంత బిజీగా ఉన్నా తనకంటూ కాస్త టైంని కేటాయించుకునేలా ఉన్నాడు. అందుకే చిల్ అయ్యేందుకు క్రికెట్ ఆడుతుంటాడు. ఇక ఇప్పుడు మ్యూజికల్ ఈవెంట్ అంటూ డల్లాస్‌లో దుమ్ములేపేందుకు తయారయ్యాడు. జూన్ 1న డల్లాస్ స్పెషల్ ఈవెంట్‌ను తమన్ చేయబోతోన్నాడు. ఈ ఈవెంట్‌ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్వహిస్తోంది. ఇక ఈ ఈవెంట్‌కు తమన్ కూడా భారీ ప్రమోషన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

తమన్ తన ఇన్ స్టాలో పోస్టుల మీద పోస్టులు వేస్తున్నాడు. టికెట్లు బుక్ చేసుకోండని అంటున్నాడు. అసలే ఇప్పుడు తమన్ మంచి ఊపు మీదున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు గుంటూరు కారం నుంచి వదిలిన పాటలు సోషల్ మీడియాను ఎలా ఊపేస్తున్నాయో చెప్పాల్సిన పని లేదు. కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. ఈ పాటలతోనే డల్లాస్‌ను తమన్ ఊపేసేలా కనిపిస్తోంది.

తమన్ నుంచి ప్రస్తుతం గేమ్ చేంజర్ రాబోతోంది. ఈ పాన్ ఇండియన్ మూవీతో శంకర్ విజన్‌తో తమన్ కొట్టే పాటలు సరిహద్దులు దాటి వినిపించేలా ఉన్నాయి. జరగండి పాట ఇప్పటికే విడుదల చేయగా అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Related Posts

See All

ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తప్పుకున్న రణవీర్ సింగ్..?🚨

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

bottom of page