top of page
Shiva YT

🚆 కొత్తగా పది రైళ్లు.. సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్

🚄 సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే మూడు వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఒకటి సికింద్రాబాద్-విశాఖ మార్గంలో, మరొకటి సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో, ఇంకొటి కాచిగూడ-యశ్వంత్‌పూర్ మార్గంలో నడుస్తున్నాయి.

ఇవే కాకుండా.. ఇప్పుడు కొత్తగా మరో వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుంచి నడవనుంది. ఇంతకీ ఆ ట్రైన్ వెళ్లే రూట్ ఏంటని ఆలోచిస్తున్నారా.? కొంచెం ఆగండి.. మేమే చెప్పేస్తాం.

ఈ కొత్త వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుంచి పూణే మార్గంలో పట్టాలెక్కనుంది. మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ వందేభారత్ సెమీ-హైస్పీడ్ రైళ్లకు ప్రజల్లో మాంచి డిమాండ్ ఉంది.

ఇప్పటివరకు వీటిని ప్రవేశపెట్టిన ప్రధాన మార్గాల్లో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా ఉంది. అది ఏమాత్రం తగ్గకపోవడంతో.. ఇంకొద్ది రోజుల్లో మరికొన్ని ప్రాంతాల మధ్య వందేభారత్ సర్వీసులు నడవనున్నట్టు తెలుస్తోంది.

అలాగే ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే.. ఒకే రోజున 10 మార్గాల్లో వందేభారత్ రైళ్లకు వర్చువల్‌గా పచ్చజెండా ఊపనున్నారు. వీటిలో సికింద్రాబాద్-పూణే రైలు కూడా ఉంది. అయితే ఇది వందేభారత్ రైలా లేక వందే సాధారణ్ రైలా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. 🚄🚆💨

bottom of page