top of page
Shiva YT

😟మీరు పొరపాటున మరొక నంబర్‌లో రీఛార్జ్ చేశారా..?😟😫

📱 మొబైల్‌లో రీఛార్జ్ చెల్లుబాటు గడువు ముగిసిన సందేశం వచ్చినప్పుడల్లా టెన్షన్ పెరుగుతుంది. 😟 అయితే కొన్ని సమయాల్లో ఒక నంబర్‌కు రీఛార్జ్‌ చేయబోయి మరో నంబర్‌కు రీఛార్జ్‌ అవుతుంది. 😫 అలాంటి సమయంలో డబ్బులు వృధా అయ్యాయని ఆందోళనకు గురవుతుంటాము. 💸 పొరపాటున వేరే నంబర్‌కు చేసిన రీఛార్జ్‌ డబ్బులు రావని టెన్షన్‌కు గురవుతుంటాము. 😓 ఇప్పుడు మీ టెన్షన్‌ని దూరం చేద్దాం. 😌 ఎందుకంటే రాంగ్ నంబర్‌లో రీఛార్జ్ చేసిన తర్వాత మీరు కంపెనీ నుంచి డబ్బును తిరిగి పొందవచ్చు. 💰 టెలికాం కంపెనీ నుంచి వాపసు పొందే మార్గం చాలా సులభం. ✔️

పొరపాటున మీరు ఏదైనా ఇతర నంబర్‌లో రీఛార్జ్ చేస్తే, వెంటనే రీఫండ్ ప్రక్రియను అనుసరించండి. 💸 పొరపాటు జరిగిన రీఛార్జ్ విషయంలో కంపెనీలు డబ్బును రీఫండ్ చేసే అవకాశాన్ని ఇస్తాయి. ✔️ వ్యక్తులు తమ మొబైల్ నంబర్‌కు బదులుగా వేరే నంబర్‌లో రీఛార్జ్ చేసినప్పుడు ఇది చాలాసార్లు జరుగుతుంది. 😖 రీఛార్జ్ అమౌంట్ ఉంటే ఇలాగే వదిలేస్తాం కానీ, ఎక్కువ డబ్బు ఖర్చయితే ఆందోళన పెరుగుతుంది. 😫

ఈ విధంగా వాపసు పొందుతారు ✔️ అయితే ఇప్పుడు మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 😌 ఎందుకంటే రీఛార్జ్ చిన్నదైనా లేదా పెద్దదైనా మీరు కంపెనీ నుంచి వాపసు తీసుకోవచ్చు. ✔️ తప్పుడు మొబైల్ నంబర్‌లో రీఛార్జ్ చేసిన తర్వాత డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చో చూద్దాం. ✔️

మీరు తప్పు నంబర్‌లో రీఛార్జ్ చేసి ఉంటే, వెంటనే దాని గురించి కస్టమర్ కేర్‌కు తెలియజేయండి. 📞 మీరు ఏ సిమ్‌ ఉపయోగిస్తున్నారో ఆ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి పూర్తి వివరాలు చెప్పండి. ☎️ ఇది కాకుండా మీరు టెలికాం కంపెనీ ఇమెయిల్ ఐడికి కూడా మెయిల్ చేయవచ్చు. 📧 దీనిలో మీరు రీఛార్జ్ చేసిన మొబైల్ నంబర్, రీఛార్జ్ మొత్తం, లావాదేవీతో సహా అన్ని వివరాలను ఇవ్వాలి. ✔️ మీరు కింద టెలికాం కంపెనీల ఇమెయిల్ ఐడిని చూడవచ్చు. 📧

Vodafone-Idea: customercare@vodafoneidea.com 📧 ఎయిర్‌టెల్: airtelpresence@in.airtel.com 📧 JIO- care@jio.com 📧

మీరు ఇచ్చిన సమాచారాన్ని టెలికాం కంపెనీలు ధృవీకరించుకోవచ్చు. ✔️ దీని తర్వాత మీ డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది. 💰

మీకు వాపసు రాకపోతే ఏం చేయాలి? కంపెనీ మీ డబ్బును తిరిగి ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఇతర ఆప్షన్లను ఉపయోగించుకోవచ్చు. ✔️ మీరు కస్టమర్ సర్వీస్ పోర్టల్ అంటే వినియోగదారుల ఫోరమ్ సహాయం తీసుకోవచ్చు. ✔️ మీరు దాని యాప్‌ని Google Play Store, Apple App Store నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 📲 కంపెనీకి వ్యతిరేకంగా ఇక్కడ ఫిర్యాదు చేయండి. ✔️ అది మీకు సహాయపడవచ్చు. ✔️

ఇంకో విషయం ఏంటంటే మీరు రీఛార్జ్ చేసుకున్న నంబర్ మీ నంబర్‌తో సమానంగా ఉంటుందని ఉండి తీరాలి. 👍 మీ నంబర్, పొరపాటు చేసిన రీఛార్జ్ నంబర్ మధ్య ఒకటి లేదా రెండు సంఖ్యల వ్యత్యాసం ఉండాలి. 🔢 సంఖ్య పూర్తిగా భిన్నంగా ఉంటే కంపెనీ వాపసు ఇవ్వడానికి నిరాకరించవచ్చు. ❌

bottom of page