హిమాచల్‌ప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాల వల్ల అక్కడ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. భీకరమైన వరదల వల్ల టూరిస్టు ప్రాంతాలన్నీ అయోమయంగా తయారయ్యాయి. ఆ రాష్ట్రంలోని టూరిస్టు కేంద్రాలు అయిన కులు, మనాలీలో తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు.
అక్కడ స్టూడెంట్స్ చిక్కుకున్నట్లు తమకు సమాచారం అందినట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (MInister KTR) తెలిపారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్‌లో ఈ విషయాన్ని చెప్పారు. ఆ విద్యార్ధులకు చెందిన పేరెంట్స్ ఈ సమాచారాన్ని షేర్ చేసినట్లు చెప్పారు. ఆ పేరెంట్స్ ఆందోళనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్‌ను అలర్ట్ చేశామన్నారు. అయితే సాయం కావాల్సిన వారు ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్‌ను లేదా తమ ఆఫీసును సంప్రదించగలరని మంత్రి పేర్కొన్నారు. 🙌💼