🇮🇳 భారత్ రూపొందించిన ఢిల్లీ జాయింట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించడం మామూలు విషయం కాదు. ఒకరకంగా చెప్పాలంటే అన్ని దేశాలను ఏకతాటిపైకి తేవడం బహుశా ఏ దేశానికీ సాధ్యమయ్యేది కాదేమో…!
చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన భారత్.. దాన్నుంచి తేరుకోక ముందే మరోసారి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతటి ఘనత వెనుక ఓ తెలుగు అధికారి కృషి, పాత్ర ఎంతో ఉంది.
🌍 “మొత్తం G20లో అత్యంత సంక్లిష్టమైన విషయం ఏమిటంటే భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో (రష్యా-ఉక్రెయిన్)పై ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం. 200 గంటల పాటు 🕦 నిరంతరాయ చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 ముసాయితా పత్రాలతో ఇది సాధ్యపడింది. ఇందులో తనకు ఇద్దరు అత్యంత సమర్థులైన అధికారులు ఎంతగానో సహకరించారని.. వారే నాగరాజు నాయుడు, ఈనం గంభీర్ అని పేర్కొన్నారు. ఆ ఇద్దరు అధికారులతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 📷🌐🕊️