top of page

సీఏ ఇంటర్‌లో ఫలితాల్లో తెలుగు సత్తా టాపర్‌గా నిలిచిన సాయి శ్రీకర్!

సీఏ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) జులై 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

సీఏ ఇంటర్మీడియట్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన వై.గోకుల్ సాయి శ్రీకర్ జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. శ్రీకర్ తండ్రి మారుతీకుమార్ సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల. బ్యాంకు ఉద్యోగరీత్యా హైదరాబాద్ నిజాంపేటలో స్థిరపడ్డారు. నగరంలోనే ఇంటర్ ఎంఈసీ చదివిన శ్రీకర్ సీఏ కోచింగ్ తీసుకున్నాడు. మూడు స్థాయులను పూర్తి చేస్తేనే సీఏ పట్టా పొందుతారు. అందులో మధ్యస్థాయి అయిన సీఏ ఇంటర్‌లో 800 మార్కులకు 688 సాధించి తొలి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. శ్రీకర్ మొదటి ప్రయత్నంలోనే సీఏ ఇంటర్‌లో గ్రూపు-1, 2 రాసి... మొదటి ర్యాంకు సాధించడం విశేషం. మళ్లీ రెండున్నరేళ్ల తర్వాత సీఏ చివరి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే తన లక్ష్యమని శ్రీకర్ వెల్లడించారు.

సీఏ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) జులై 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు వెబ్‌సైట్‌లో తమ రోల్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌లను ఎంటర్‌ చేయడం ద్వారా స్కోరు కార్డులు, మెరిట్‌ జాబితాలను పొందొచ్చు.

సీఏ ఫైనల్‌ పరీక్షలో అహ్మదాబాద్‌కు చెందిన అక్షయ్‌ రమేశ్‌ జైన్‌ 616/800 మార్కులు సాధించగా.. కల్పేశ్‌ జైన్‌ జి 603/800; ప్రఖార్‌ వర్షిణి 574/800 మార్కులతో టాపర్లుగా నిలిచారు. ఇకపోతే సీఏ ఇంటర్‌లో వై. గోకుల్‌ సాయి శ్రీకర్‌; నూర్‌ సింగ్లా, కావ్య సందీప్‌ కొఠారీలు టాపర్లుగా నిలిచి సత్తా చాటారు. ఇంటర్మీడియట్‌ కోర్సులో గ్రూపు-1 పరీక్షలు మే 3, 6, 8, 10 తేదీల్లో; గ్రూపు-2ను 12, 14, 16, 18 తేదీల్లో ICAI నిర్వహించింది. అలాగే, ఫైనల్‌ విద్యార్థులకు గ్రూపు-1ను మే 2, 4, 7, 9 తేదీల్లో, గ్రూపు-2ను మే 11, 13, 15, 17 తేదీల్లో పరీక్ష నిర్వహించిన ఐసీఏఐ తాజాగా ఫలితాలను ప్రకటించింది.

కేవలం 10.24 శాతం మాత్రమే ఉత్తీర్ణత.. సీఏ ఇంటర్ గ్రూపు-1 పరీక్షకు 1,00,781 మంది హాజరుకాగా.. వారిలో 19,103 మంది(18.95%) పాసయ్యారు. గ్రూపు-2లో 81,956 మందికిగాను 19,208 మంది(23.44%) ఉత్తీర్ణత సాధించారు. రెండు గ్రూపులు రాసిన వారు 39,195 మందే ఉండగా.. వారిలో 4,014 మందే పాసయ్యారు. అంటే 10.24 శాతం అభ్యర్థులే చివరి పరీక్షలు రాసేందుకు అర్హత సాధించారు. ఇక సీఏ ఫైనల్ పరీక్షల ఫలితాల్లో 25,841 మంది పరీక్షకు హాజరుకాగా.. 2,152 మందే(8.33%) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page