top of page
MediaFx

మన తెలుగు స్టార్ హీరోలు ఎవరెవరు ఎంతవరకు చదువుకున్నారో తెలుసా..?

మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రయాణం మారింది. ఒకప్పుడు భాష, ప్రాంతం వరకు మాత్రమే పరిమితమైంది. రాజమౌళి లాంటి దర్శకుడు వచ్చి తెలుగు సినిమాను అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లారు. దీంతో దర్శకులంతా ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నారు. దీంతో ప్రపంచంలోని మేటి సినీ పరిశ్రమలన్నీ తెలుగు సినీ పరిశ్రమవైపు దృష్టిసారించాయి. 🌍

మన తెలుగు స్టార్ హీరోలు ఎంతవరకు చదువుకున్నారు? వారి విజయం వెనక ఎవరున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. 🎓

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. 🎓

ప్రభాస్

ప్రభాస్ బాహుబలి సినిమాతో జాతీయస్థాయికి చేరగా, కల్కి సినిమాతో అంతర్జాతీయ స్థాయికి చేరబోతున్నారు. బీటెక్ పూర్తిచేసిన తర్వాత ఈశ్వర్ సినిమా ద్వారా పరిశ్రమకు పరిచయం అయ్యారు. 🌟

మహేష్ బాబు

మహేష్ బాబు చెన్నైలోని లయోలా కాలేజ్ లో హానర్స్ డిగ్రీ ఆఫ్ కామర్స్ చదివారు. చిన్నతనం అంతా చెన్నైలోనే జరగడంతో తెలుగులో చదవడం, రాయడం రాదు. 🎓

ఎన్టీఆర్

ఎన్టీఆర్ గ్లోబల్ హీరో స్థాయికి ఎదిగారు. హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ వరకు చదవుకున్నారు. 🌍

రామ్ చరణ్

రామ్ చరణ్ లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. 'చిరుత' సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. 🎬

అల్లు అర్జున్

అల్లు అర్జున్ బ్యాచ్ లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేశారు. ఎమ్మెస్ఆర్ కాలేజ్, హైదరాబాద్ లో చదివారు. 📚

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హైదరాబాద్ లో బీకాం పూర్తి చేసారు. చిన్న పాత్రల్లో నటిస్తూ స్టార్ హీరో అయ్యాడు. 🌟

నాని

సహజ నటుడు నాని వెస్లీ డిగ్రీ కాలేజ్, హైదరాబాద్ లో చదవుకున్నారు. బాపు, రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా శిష్యరికం చేసి 'అష్టా చెమ్మా' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 🎥


bottom of page