విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్. అయితే గత కొంతకాలంగా అతను నటించిన సినిమాలేవీ పెద్దగా రిలీజ్ కాలేదు. ఈక్రమంలో చాలా రోజుల తర్వాత ‘చక్ర వ్యూహం.. ద ట్రాప్’ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు అజయ్.
విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్. అయితే గత కొంతకాలంగా అతను నటించిన సినిమాలేవీ పెద్దగా రిలీజ్ కాలేదు. ఈక్రమంలో చాలా రోజుల తర్వాత ‘చక్ర వ్యూహం.. ద ట్రాప్’ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు అజయ్. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు మధుసూదన్ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి కాండ్రేంగుల, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రగ్యా నయన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 2న థియేటర్లలో విడుదలైన చక్ర వ్యూహం సినిమా డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. చిన్న సినిమానే అయినా థ్రిల్లంగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఇలా థియేటర్లలో ఆకట్టుకున్న చక్రవ్యూహం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అజయ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. థియేట్రికల్ రన్ ముగియడంతో గురువారం జులై 6 నుంచి చక్రవ్యూహం మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.కాగా సావిత్రి నిర్మించిన చక్రవ్యూహం సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ థియేటర్లలో రిలీజ్ చేసింది. చాలా రోజుల తర్వాత పోలీసాఫీసర్‌గా కనిపించిన అజయ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా హిట్ అవ్వడానికి మరో కారణం మూవీ రన్‌టైమ్. కేవలం 1 గంట 47 నిమిషాల నిడివి ఉండే ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. మరి వీకెండ్‌లో మంచి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి చక్రవ్యూహం మంచి ఛాయిస్.