top of page

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లోకి న్యాచురల్ స్టార్..


తెలుగు ఇండియన్ ఐడల్ షో వేదికపై నాని సందడి చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో సీజన్ 2లోనూ నాని తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద సందడి చేశారు. గతంలో ఆయన నటించిన దసరా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సింగింగ్ రియాల్టీ షోలో పాల్గొన్నాడు. అప్పట్లో నాని వచ్చిన ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి ఇండియన్ ఐడల్ రియాల్టీ షోలో సందడి చేయనున్నాడు.

ఇదిలా ఉంటే.. హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని.. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు. చాలా నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఇఫ్పటికే ఈసినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మరింత క్యూరియాసిటిని కలిగించాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ షోలో పాల్గొన్నాడు నాని. మొదటి తొమ్మిది మంది పోటీదారులతోపాటు జడ్జీలు ఎస్ ఎస్ తమన్, గీతా మాధురి, సింగర్ కార్తీక్ లతో నాని సందడి చేయనున్నారు. నాని అతిథిగా వచ్చిన ఈ రెండు ఎపిసోడ్స్ శుక్రవారం, శనివారాల్లో రాత్రి 7 గంటల నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page