బాహుబలి 2 సినిమాకు 1800 కోట్లు వచ్చినపుడు ఏదో ఒక్క సినిమాకు అలా కనెక్ట్ అయ్యారు కాబట్టి వచ్చాయిలే అనుకున్నారంతా. అనుకున్నట్లుగానే ఆ తర్వాత 1000 కోట్ల సినిమా రావడానికి మూడేళ్లకు పైగానే టైమ్ పట్టింది.
బాహుబలి 2 సినిమాకు 1800 కోట్లు వచ్చినపుడు ఏదో ఒక్క సినిమాకు అలా కనెక్ట్ అయ్యారు కాబట్టి వచ్చాయిలే అనుకున్నారంతా. అనుకున్నట్లుగానే ఆ తర్వాత 1000 కోట్ల సినిమా రావడానికి మూడేళ్లకు పైగానే టైమ్ పట్టింది. మళ్లీ కేజియఫ్ 2తో యశ్.. ట్రిపుల్ ఆర్‌తో రాజమౌళి మరోసారి 1000 కోట్ల మార్క్ అందుకుని ఔరా అనిపించారు. బాలీవుడ్‌కు అందని ద్రాక్షలా ఉన్న 1000 కోట్ల మార్క్‌ను 2023లో పఠాన్‌తో అందుకుని చరిత్ర సృష్టించారు షారుక్ ఖాన్. దాంతో ఇప్పుడు ప్రతీ పెద్ద సినిమాకు 1000 కోట్లు అనేది కామన్ టార్గెట్ అయిపోయింది.