top of page
MediaFx

పెళ్లైనా మరో స్త్రీ కావాలని పురుషులు ఎందుకని కోరుకుంటారో తెల్సా..


ఎర్లీ మ్యారేజ్:

ఎర్లీ మ్యారేజ్.. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని చెడగొడుతుంది. చిన్న వయస్సులో కెరీర్‌పై దృష్టి సారించే వ్యక్తి తన వ్యక్తిగత కోరికలపై ఎక్కువ దృష్టి పెట్టడు. వృత్తిలో స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు.. ఆ వ్యక్తి తన భార్యపై ఆసక్తి చూపించకపోవచ్చు. వాస్తవానికి పురుషులు తమ కోరికలను బట్టి స్త్రీల పట్ల ఆకర్షితులవుతారు అని చాణక్యుడు చెప్పాడు.

శారీరక సంతృప్తి లేకపోవడం:

వైవాహిక సంబంధంలో మానసిక సంబంధంతో పాటు శారీరక సంబంధం కూడా చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు శారీరక సంతృప్తి లేనప్పుడు పురుషుడు సహజంగానే మరో స్త్రీ సాంగత్యంలో పడిపోతాడని చాణక్యుడు చెప్పాడు. వైవాహిక బంధంలో శారీరక సంబంధం బాగాలేకపోతే భార్యాభర్తలు పరస్పరం మాట్లాడుకోవాలి. లేదంటే అది అనైతిక సంబంధాలకు దారి తీస్తుంది. నమ్మకం లేకపోవడం:

భార్యాభర్తల మధ్య ఏర్పడే నమ్మకం.. వారి మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటేనే బంధం నిజాయితీగా ఉంటుంది. భర్త ప్రవర్తనపై భార్యకు అనుమానం ఉంటే, అలాగే భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం కలిగిస్తే.. వారిరువురి అనైతిక సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉందని చాణక్యుడు చెప్పాడు.

తల్లిదండ్రులుగా మారడం:

సాధారణంగా భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ.. ఓ బిడ్డ పుట్టాక అది కనిపించకపోవచ్చు. ఆ సమయంలో భార్య తన భర్తపై తక్కువ శ్రద్ధ చూపించవచ్చు. భర్త కంటే భార్య బిడ్డకే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు.. అతడు వేరే స్త్రీని ఇష్టపడే అవకాశం ఉండొచ్చునని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.

చిన్న చిన్న విషయాలకే కలత చెందడం:

భార్యాభర్తలు కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే మనస్తాపానికి గురవుతారు. కొంతమంది పురుషులైతే తమ భాగస్వామిలో తప్పునే ఎత్తిపొడుస్తుంటారు తప్పితే.. ఆమెలోని మంచిని గ్రహించరు. చాణక్యుడు ప్రకారం, పురుషులు ఇతర స్త్రీలతో ప్రేమలో పడటానికి ఈ పగ, ద్వేషాలే కారణమవుతాయి.

bottom of page