top of page
Shiva YT

🔊 ప్రచారం ముగిసింది.! నెక్స్ట్ పోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్.?

📢 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అలా తెరపడిందో లేదో కామారెడ్డి, కరీంనగర్‌లో ఇలా ఘర్షణకు తెరలేచింది.

కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవైపు, బీజేపీ, బీఆర్ఎస్ వర్గాలు మరోవైపు ఆందోళనకు దిగారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సోదరుడు కొండల్‌ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానికేతరులు ఇతర నియోజకవర్గాల్లో ఉండకూడదు. కొండల్‌ రెడ్డి వెంటనే కామారెడ్డి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఐతే కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్‌ రెడ్డి తరపున తాను చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌గా ఉన్నాను కాబట్టీ ఇక్కడ ఉండొచ్చన్నారు. ఓవైపు పోలీస్‌ బలగాలు మరోవైపు కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా గుమికూడారు. పరస్పర వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాల వారిని నచ్చజెప్పి ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా చూశారు. 🗳️

bottom of page