తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.. 🌦️🌍 తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడాన వానలు పడే అవకాశముంది.. 🌴💧
తెలంగాణకు ఎల్లో అలెర్టు కూడా జారీ చేసింది. అలాగే రానున్న రెండు రోజులు రాష్ట్రంలో తేలిపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో కూడా చిరు జల్లులు పడే అవకాశం ఉందట. 🏞️💦
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 🌦️🏞️ హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అటు ఏపీలోను ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, కోస్తా జిల్లాల్లో వానలు పడొచ్చని అంచనా వేసింది. 🌧️