🏟️ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అకాల వర్షాల కారణంగా వచ్చిన వరదలు, ముంపు, ఇతర ప్రజా సమస్యలపై విపక్ష నేతలు.. ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా.. అధికార పక్షం సైతం అంతే దీటుగా సమాధానం ఇస్తోంది. 👥🏭🌾
సభ్యులు అడిగి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. అయితే, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మంత్రి కేటీఆర్ విపక్షాలకు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తూ ర్యాగింగ్ చేసినంత పని చేస్తున్నారు. 👔🏃♂️🤝
కాంగ్రెస్, బీజేపీ నాయకులకు సందర్భం వచ్చిన ప్రతిసారి తన మాటలతో చురకలు అట్టింస్తున్నారు. సాధారణంగా అసెంబ్లీ జీరో అవర్‌లో సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు నోట్ చేసుకున్నాం.. పరిశీలిస్తాం.. అని సమాధానం చెబుతారు. 👤💬🕵️
కానీ మంత్రి కేటీఆర్ మాత్రం విపక్షాలను అటాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ సభ్యుడు జగ్గారెడ్డి మాట్లాడుతూ.. హోమ్ గార్డ్స్, జర్నలిస్ట్ లు, క్యాన్సర్ రోగుల గురించి ప్రశ్నించగా.. రైతులకు రుణమాఫీ చేశాం, సంగారెడ్డి వరకు మెట్రో తీసుకొచ్చాం.. కనీసం వాటికి ఒక్కరు కూడా కృతఙ్ఞతలు చెప్పడం లేదంటూ సెటైర్ వేసారు. 👥🔍💬