top of page
MediaFx

ఇకపై రాత్రి 10.30 కల్లా తెలంగాణలో షాపులు బంద్!


😲 తెలంగాణలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు! ఇకపై షాపులు, ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 10.30-11.00 కల్లా కట్టేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో నేరాల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అనవసరంగా రాత్రుళ్లు బయట తిరగొద్దని, తెలియని వారికి లిఫ్ట్ ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరించారు. రాత్రుళ్లు పబ్లిక్ ప్లేసుల్లో మద్యం తాగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 🍻🚔

కానీ, ఈ ఆదేశాలపై వ్యాపారులు, ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నైట్‌లైఫ్‌పై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. చార్మినార్ ప్రాంతంలో అర్ధరాత్రి వరకూ జనసందడి ఉంటుందని ఒక వ్యాపారి తెలిపారు. ‘‘ప్రభుత్వం నేరాలను నియంత్రించాలి కానీ ప్రజలకు నష్టం కలగకూడదు’’ అన్నారు. మరో వ్యాపారి మాట్లాడుతూ, "సాయంత్రం సమయాల్లో చాలామంది కస్టమర్లు హడావుడిగా షాపులకు వస్తుంటారు. కాబట్టి అర్ధరాత్రి వరకూ షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతించాలని అన్నారు. 🕛

bottom of page