top of page

ఈసారైనా కేంద్ర కేబినెట్లో దక్కేన తెలంగాణ నేతలకు చోటు?

Telangana: ఢిల్లీలో నేడు ప్రధాని మోదీ (Pm Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. అయితే కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీలో ఎలాంటి మార్పులు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే తెలంగాణ నుంచి ఇద్దరిని తీసుకునే అవకాశం ఉంది. నిన్న తెలంగాణ బీజేపీలో చేసిన మార్పుల కారణంగా పలువురికి కేంద్రంలో చోటు దక్కే అవకాశం ఉంది. ప్రముఖంగా పలువురు పేర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బండి సంజయ్ (Bandi Sanjay)ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో కీలక నేతగా ఉన్న బండిని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడంతో ఆయన అవసరాలను ఢిల్లీలో వాడుకోవాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు (Soyam bapurao)కూడా కేంద్ర పదవి వచ్చే అవకాశం ఉంది. నిన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డాను బాపూరావు కలవడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది.ఈ సమావేశంలో కీలక బిల్లులు, వర్షాకాల సమావేశాలు, ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ నేపథ్యంలో కొంతమంది మంత్రులు రాజీనామా చేస్తారా? వారి స్థానంలో కొత్త వారికీ అవకాశం కల్పిస్తారా అనేది చూడాలి. ఎంపీ లక్ష్మణ్, ధర్మపురి అరవింద్ వంటి వారికి కేబినెట్ లో చోటు దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే నిన్న బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి (Kishan Reddy) కి తెలంగాణ పగ్గాలు అప్పగించడంతో ఆయన స్థానంలో ఎవరు చేరతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ స్థానంలో బండి సంజయ్ (Bandi Sanjay) ను తీసుకునే ఆలోచనలో కేబినెట్ ఉంటే ఆయన కాదంటే ఏం చేయాలనే దానిపై కసరత్తు స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page