top of page
Shiva YT

చట్టం నుంచి తప్పించుకోలేరు - కెసిఆర్ ను హెచ్చరించినా ఈటల

చట్టం నుంచి తప్పించుకోలేరని సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ హెచ్చరికలు పంపారు.

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయంటూ కొంత మంది విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ చాలా బలంగా ఉందని.. చాపకింద నీరులా పార్టీ విస్తరిస్తోందని చెప్పారు. ఠక్కున పైకి వెళ్లి పడిపోవడానికి.. బీజేపీ బలమేమీ సెన్సెక్స్‌ కాదన్నారు. తెలంగాణ గడ్డపై తమ విజయపరంపర 2019 ఎంపీ ఎన్నికలతో మొదలైందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటామని చెప్పారు. మునుగోడులోనూ నైతికంగా బీజేపీనే గెలిచిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలనను, దోపిడీని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ రోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు.. కానీ చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పారు. దేశంలో కుటుంబ పార్టీల వల్ల వాళ్ల కుటుంబాలు మాత్రమే బాగుపడతాయని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారన్నారు.


bottom of page