top of page
MediaFx

తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభం 🗳️

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది, సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోక్ సభ, శాసనసభ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు 11.34 శాతం ఓటింగ్ నమోదైంది.

గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 2,87,007 మంది, మహిళలు 1,74,794 మంది ఉన్నారు. ఈ రోజు ఓటు హక్కు ఉన్నవారందరికీ వేతనంతో కూడిన సెలవును ఈసీ ప్రకటించింది. జూన్ 5వ తేదీ ఫలితాలు వెలువడనున్నాయి.

కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్ధుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఆయా పార్టీల అగ్రనేతలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి పట్టభద్రులను మద్దతు కోరారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల అభ్యర్ధుల గెలుపోటముల్లో కీలకంగా మారవచ్చు.

bottom of page