top of page

📝📚🧑‍🏫 మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్న తెలంగాణ టెట్-2023 పరీక్ష.. 📅📚

రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌-2023) జరగనుంది. 📝📆 పరీక్ష ఏర్పాటుకు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

📝 పేపర్‌ 1కు 1,139 పరీక్ష కేంద్రాలు, పేపర్ 2కు 913 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం పరీక్ష జరగనుంది. 📄🕒 ఉదయ జరిగే పేపర్ 1 పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం జరిగే పేపర్ 2 పరీక్షకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.

👨‍🎓 పరీక్ష కేంద్రాలలోని అభ్యర్థులు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరననున్నాయి. 📖📊 ఇక పేపర్‌ 1 పరీక్షకు 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పేపర్ 2 పరీక్షకు 2,08,498 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు.

🌐📋పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఓఎమ్‌ఆర్‌ షీట్లపై ఆన్సర్లు సూచించడానికి రెండు బాల్‌ పాయింట్‌ బ్లాక్‌ పెన్నులు తమ వెంట తెచ్చుకోవాలన్నారు. ఆధార్‌ కార్డు, హాల్‌టికెట్‌తోపాటు ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్‌ తప్పనిసరిగా తమవెంట తెచ్చుకోవాలని, లేకుంటే పరీక్షకేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. 🚀📢

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page