top of page

🏢 హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ షురూ.. 💼

🏠 హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆన్‌లైన్‌ ద్వారా ఎంపిక చేస్తున్న లబ్దిదారులకు, వచ్చేనెల 2 నుంచి డబుల్‌బెడ్‌రూం ఇండ్లను పంపిణీ చేయనున్నారు. మొత్తం 12వేల లబ్డిదారులకు ఈ ఇండ్లను దశల వారీగా అందజేస్తారు. 👥

📋 హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. 💬

🚀 దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు మంత్రి తలసాని. లబ్దిదారులను ఎంపిక చేసేందుకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. 🎉

🔍 లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే మొదటిసారిగా ఆన్‌లైన్‌ డ్రాను తీస్తున్నట్టు చెప్పారు మంత్రి. NSI రూపొందించిన ర్యాండమ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా అర్హులను ఎంపిక చేస్తున్నామన్నారు. 🌐

💼 హైదరాబాద్‌ జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో మొదటి విడతలో 12 వేల మందికి ఇండ్లను అందజేస్తామన్నారు. మహానగరంలోని 24 నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 7500 మంది చొప్పున 60వేల మందితో జాబితాను సిద్దం చేశారు అధికారులు. 💪

📝 డబుల్‌బెడ్‌రూం కోసం లక్షల్లో అప్లై చేసుకున్నారు పేదలు. లక్షా 160వేల మంది దరఖాస్తు చేసుకోగా, 80వేల మంది చిరునామాలకు వెళ్లిన వారి స్థితిగతులను పరిశీలించారు అధికారులు. 📑


Comentarios


bottom of page