📅 2023 ఏప్రిల్ 1 నుంచి పేస్కేలు వర్తింపు ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చూసుకుంటే మెప్మా, సెర్ప్‌లలో పనిచేసే ఉద్యోగులకు 2023 ఏప్రిల్ 1 నుంచి పేస్కేల్ వర్తించనుంది.
ప్రస్తుత కనీస వేతనానికి సమీపంలో ఉన్నటువంటి పేస్కేళ్లను రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేయనుంది. అలాగే మెప్మా ఉద్యోగులకు ప్రస్తుత కనీస వేతనానికి కూడా రక్షణ కల్పించనున్నారు. సెర్ప్ ఉద్యోగుల ప్రస్తుత స్థూల వేతనం, ఇతర అలవెన్సులకు సైతం రక్షణ ఉండనుంది. మరో విషయం ఏంటంటే పేస్కేలు వర్తింపజేసినా కూడా సెర్ప్, మెప్మా ఉద్యోగులు ఇప్పటి తరహాలోనే రిజిస్టర్ సొసైటీ ఉద్యోగులుగా కొనసాగుతారని ప్రభుత్వ తెలిపింది. ఉద్యోగం విషయంలో ఎలాంటి మార్పు కూడా ఉండదని స్పష్టం చేసింది. అయితే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించినట్లుగా లేదా ప్రభుత్వంలో విలీనం చేసుకున్నట్లుగా పరిగణించేందుకు వీలు లేదు. అలాగే వీరికి ఈఎస్‌ఐ, పీఎఫ్ సదుపాయాలు కూడా యథాతథంగానే ఉంటాయి. ఇక నుంచి ప్రభుత్వం నుంచి ముందుగా అనుమతి తీసుకున్న తర్వాతే మెప్మాలో రెగ్యులర్/కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ పోస్టులను సృష్టించాలని ఆ ఉత్తర్వులు పేర్కొన్నాయి.