top of page

🌟👩‍🏫 తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 📚

📅 తెలంగాణ నిరుద్యోగ అభ్యర్ధులు విద్యాశాఖపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 📣🗓️ ఈ నెల 6నే నోటిఫికేషన్ ఇచ్చిన విద్యాశాఖ బయట పెట్టకుండా జాప్యం చేసింది. ✉️🏫 రెండు రోజుల తర్వాత తీరిగ్గా విద్యాశాఖ అధికారులు నోటిఫికషన్‌ను బయటపెట్టారు. 📅👨‍🏫 టీచర్‌ నియామక నోటిఫికేషన్ విడుదల లోనూ విద్యాశాఖ అధికారుల మొద్దు నిద్రపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 😴

🧾 పరీక్షలు ఎలాగూ సవ్యంగా నిర్వహించడం చేతకాదు కనీసం నోటిఫికేషన్‌ అయినా సకాలంలో ఇవ్వలేరా అంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. 📝🏫 మరికొందరేమో నోటిఫికేషన్‌ విడుదల చేయడానికే బద్దకించారు.. వీళ్ళా ఎగ్జామ్ నిర్వహణ చేసేది అంటూ ఫైర్ అయ్యారు. 📚👨‍🏫🎓 కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగస్టు 24 ప్రకటించిన విషయం తెలిసిందే. 🎉📚 మొత్తం పోస్టుల్లో 2,575 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు, 1739 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 611 భాషా పండితులు పోస్టులు, 164 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులున్నాయి. 📝📖📄 వీటన్నింటినీ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. 👩‍🏫

👩‍🏫 బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ✅

🕐 అలాగే టెట్‌ పరీక్షలోనూ అర్హత సాధించి ఉండాలి. 📊👨‍🏫 అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏండ్ల లోపు ఉండాలి. 📆

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page