రాష్ట్రంలో ప్రతి గడప నుండి రామ మందిరం నిర్మాణానికి నిధి సమకూర్చుకునేందుకు నిధి సేకర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, సంఘ్ పరివార్ తదితర ధార్మిక సంస్థలు నిధి సేకరించారు. ఇలా సేకరించిన నిధిలో రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుండి 250 కోట్ల రూపాయల నిధి సమకూరింది. ఇలా రాజస్థాన్, గుజరాత్‌లు మొదటి స్థానంలో ఉండగా.. 170 కోట్ల రూపాయల నిధిని అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్‌కు సమకూర్చి తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. నిధి సేకరణతో పాటు జనవరి 22న ఉత్సవాల కోసం హైదరాబాద్ నుండి స్వామికి వెండి పాదుకలు, వెండి గొలుసులు తెలంగాణ నుండే వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నారు. అయోధ్యకు ఉత్సవాల కోసం వచ్చే ప్రతినిధులకు, భక్తులకు జనవరి 16 నుండి మూడు నెలల పాటు కొందరు ఆరు నెలల పాటు మరికొందరు అన్నదాన కార్యక్రమాలు చేయనున్నారు. అయోధ్యలో ఆహారానికి సంబంధించిన వితరణ కార్యక్రమానికోసం తెలంగాణ రాష్ట్రానికే అవకాశం రావడం సంతోషంగా ఉంది అన్నారు ధార్మిక సంస్థల ప్రతినిధులు. నిధి సేకరణతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర భక్తులు ముందు ఉండడం సంతోషంగా ఉంది అన్నారు వీ హెచ్ పి సెక్రటరీ. జనవరి 22న రామ జ్యోతులు వెలిగించుకోవాలని కోరారు. 🌟🙏