top of page

🌱🌍 శభాష్‌! చైనా, బ్రెజిల్‌ తర్వాత తెలంగాణే!? 🌳🌍

మొక్కల పెంపకంలో కేసీఆర్ సర్కారు ప్రపంచ రికార్డు నెలకొల్పుతోంది. 👏🌿 చైనా, బ్రెజిల్ తర్వాత పచ్చదనాన్ని పెంచడంలో అతి పెద్ద మానవ ప్రయత్నంగా తెలంగాణ సర్కారు చేపట్టిన హరిత హారం కార్యక్రమం రికార్డులకెక్కింది. 🌳🌿 ఈ కార్యక్రమంతో పర్యావరణ సమతుల్యం కాపాడుకోవడంతో పాటు జీవనోపాధి కల్పన, మంచి వర్షపాతం నమోదవుతోంది. 🌍🌱 ప్రతి గ్రామంలో చెట్ల పెంపకాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చట్టం చేసింది. 📜🌱 ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి, మొక్కలను నాటి వాటిని రక్షించి, గ్రామంలో పచ్చదనాన్ని పెంచి, పరిశుభ్రతను కాపాడాలని ఆ చట్టం చెబుతోంది. 🌿🌳 గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. 👥🌿 హరిత రక్షణ కమిటీలను కూడా ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్ ద్వారా మొక్కలను పర్యవేక్షిస్తున్నారు. 🌿🏞️ పచ్చదనం పెంపొందించేందుకు అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, సంస్థగత ప్లాంటేషన్, హోమ్ స్టెడ్ ప్లాంటేషన్, ఆగ్రో ఫారెస్ట్రి ప్లాంటేషన్ పేరిట మొక్కలను పెద్ద సంఖ్యలో నాటుతు న్నారు. 🌿🌾🌳


Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page