తెలంగాణ రాష్ట్రంలో 2023 –24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని కౌన్సెలింగ్ నిర్వహిస్తోన్న సంగతి తెలిందే. 🎓🏛️
ఈ నేపథ్యంలో హైకోర్టు కీలకతీర్పు వెలువరించింది. ⚖️ శాశ్వత నివాసితులైన విద్యార్థులను స్థానికులుగానే పరిగణించాలని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. 👨⚖️👩⚖️ తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీల అడ్మిషన్ 2017లోని 3(GGG)(B) నిబంధనల ప్రకారం విద్యార్ధులను స్థానికులుగా పరిగణించాలంటే నీట్ పరీక్షకు ముందు తెలంగాణలోనే నాలుగేళ్లు చదివి ఉండాలి. 📚🎓 ఈ నిబంధనను హైకోర్టు తప్పుబట్టింది.
ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తోందని అభిప్రాయపడింది. 🚫 ఇలాంటి కేసులను తప్పుబడుతూ గతంలో సుప్రీంకోర్టు సైతం పలు కేసుల్లో ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేసింది. ✍️ తెలంగాణలోని శాశ్వత నివాసిత విద్యార్ధులకు 3 (జీజీజీ)(బీ) నిబంధన వర్తించదని తేల్చిచెప్పింది. 📜📚 ఐతే ఈ నిబంధనను పూర్తిగా ఎత్తివేయడం కుదరదని పేర్కొంది. ⚠️ ఈ కేసులో పిటిషనర్లు తాము తెలంగాణలో శాశ్వత నివాసితులమని చెబుతున్నారు. 📜🏠 అందువల్ల వారు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా సర్టిఫికెట్ అందజేస్తే మెరిట్ ప్రకారం స్థానిక కోటాలో సీట్లు కేటాయించాలని వర్సిటీని ఆదేశించింది. 📜🎓