top of page

🛢️💰💨 తెలంగాణ సర్కార్‌ పెట్రోల్‌ ధరలు తగ్గించాలి..బీఆర్ఎస్‌కు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..🛢️

🏛️🚜🌾 తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు కొనసాగిస్తోంది. ఓవైపు చేరికలు.. మరోవైపు అగ్రనేతల వరుస పర్యటనలతో తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. 🏞️🚶‍♂️🗺️

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్న కమలం పార్టీ.. త్వరలోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. 📜🤝👥 ఈ క్రమంలో పార్టీలో అంతర్గత మార్పులపైనా కిషన్‌రెడ్డి ఫోకస్ పెట్టారు. 8 మంది జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశముంది. 🏛️🔄👥 కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్‌ కిషన్‌ రెడ్డి సమక్షంలో విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావు, ఆయన భార్య దీపా కమలం పార్టీలో చేరారు. 🏛️🤝👩‍❤️‍👨🏛️🚜🌾 తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలన్నారు. ఆ మార్పు కోసమే వికాస్‌ లాంటి వారు పార్టీలో చేరుతున్నారన్నారు. 🏞️🏢🗳️ ఇంకా అనేక మంది బీజేపీలో చేరాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధర తగ్గింపుపై BRS నేతలు చేస్తున్న విమర్శలకు కిషన్‌ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. 🛢️⚖️💬 పెట్రోలియం ఉత్పత్తులు, వంట గ్యాస్‌పై మాట్లాడే నైతిక హక్కు BRS నేతలకు, మంత్రులకు లేదన్నారు. తెలంగాణలోనే పెట్రోల్‌ ధర అధికంగా ఉందన్నారు. చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ⛽🛢️🔼


コメント


bottom of page