కరీంనగర్‌లో విద్యార్థిని మిస్సింగ్ మిస్టరీ వీడింది. మూడు రోజుల తర్వాత అసలు ట్స్విట్ బయటపడింది. హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేకపోవడంతో ఇలా వెళ్లిపోయింది.. అందరినీ టెన్షన్ పెట్టింది. చివరికి జేబీఎస్‌లో బాలికను అదుపులోకి తీసుకొని కుటుంబసభ్యులకు అప్పగించారు.
కరీంనగర్‌లో విద్యార్థిని మిస్సింగ్ మిస్టరీ వీడింది. మూడు రోజుల తర్వాత అసలు ట్స్విట్ బయటపడింది. హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేకపోవడంతో ఇలా వెళ్లిపోయింది.. అందరినీ టెన్షన్ పెట్టింది. చివరికి జేబీఎస్‌లో బాలికను అదుపులోకి తీసుకొని కుటుంబసభ్యులకు అప్పగించారు. కరీంనగర్ విద్యారణ్యపురికి చెందిన విద్యార్థిని (12) కరీంనగర్‌లోని ప్రైవేటు స్కూల్ హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదువుతోంది. పెద్దపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలిక 27న బస్సులో బయలుదేరగా.. ఇంటికి రాకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె కోసం గాలించారు.బాలిక కరీంనగర్ నుంచి జేబీఎస్‌కు వెళ్లి.. అక్కడి నుంచి జగిత్యాల, వరంగల్, హైదరాబాద్, సిద్దిపేట, కామారెడ్డి ప్రాంతాలు తిరిగి.. గురువారం అర్ధరాత్రి మళ్లీ జూబ్లీ బస్టాండ్‌కు చేరుకుంది. ఆటోడ్రైవర్ బాలికను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. బస్సులో ప్రయాణం ఉచితం కావడంతో మంచి నీళ్లు తాగుతూ అన్ని ప్రాంతాలకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సులో ఉచితం కావడంతోనే ఆమె ఇలా మూడు రోజుల పాటూ తిరిగినట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసి తండ్రి కూడా అవాక్కయ్యారు.🚌👧