😕 ఈ మొత్తం స్క్రుటినీలో ఎవరికి బెర్త్ కన్‌ఫామ్.. ఎవరికి ఎర్త్ అన్నది ఉత్కంఠగా మారింది. 119 నియోజకవర్గాల టికెట్ల కోసం 700 మంది అప్లై చేసుకున్నారు. దీంతో పీసీసీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఎవర్ని ఎంపిక చేయాలో ఎవర్ని తీసేయాలో తెలియడం లేదు. దీనికోసం మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది పీఈసీ. ముందు సింగిల్ అప్లికేషన్‌లు వచ్చిన టికెట్లను తొలి దశలో ప్రకటిస్తారు. తర్వాత కొన్ని అప్లికేషన్‌లు వచ్చిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల లిస్టును ఢిల్లీ ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపి.. అక్కడి నుంచి ఫైనల్ లిస్టు తెప్పించుకుంటారు. కొన్ని నియోజకవర్గాల్లో పదికన్నా ఎక్కువమంది అప్లై చేసుకున్నారు. ఇక్కడ అభ్యర్థులను లాస్ట్ మినిట్‌లో ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. 🤔 తొలి దశలో ఇప్పటికి మొదటి 30 సీట్లు ఖరారైనట్లు తెలుస్తోంది. వారిలో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ – ఉత్తమ్ పద్మావతి, మధిర – భట్టి విక్రమార్క, మంథని – శ్రీధర్ బాబు, జగిత్యాల – జీవన్ రెడ్డి, ములుగు – సీతక్క, భద్రాచలం – పొదెం వీరయ్య , సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, నల్గొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలంపూర్ – సంపత్ కుమార్, నాగార్జునసాగర్ లో జానారెడ్డి కుమారుడు కుందూరు జైవీర్ రెడ్డి.. కామారెడ్డి – షబ్బీర్ అలీ, మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు, ఆందోల్ – దామోదర రాజనర్సింహ, పరిగి – రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీం పట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి, ఆలేరు – బీర్ల ఐలయ్య, బాల్కొండ – సునీల్ రెడ్డి, కొత్తగూడెం- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట – దొంతి మాధవ రెడ్డి, పెద్దపల్లి- విజయ రమణరావు, చొప్పదండి- మేడిపల్లి సత్యం, నిర్మల్ – శ్రీహరి రావు, భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ రెడ్డి, బెల్లంపల్లి- గడ్డం వినోద్, నాంపల్లి – ఫిరోజ్ ఖాన్, వేములవాడ- అది శ్రీనివాస్ ఉన్నారు. 😊