🔥 సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా.. 🌾 కర్ణాటక ఫార్ములా కనికట్టు చేస్తుందా.. ☑️ దివంగత వైఎస్ సెట్ చేసిన ట్రెండ్‌ను కాంగ్రెస్ పార్టీ ఇంకా కొనసాగిస్తోందా.. 📈 అంటే అవుననే పేర్కొంటున్నాయి.. 🗳️ పొలిటికల్ వర్గాలు.. 🤝 చేవెళ్లతో కాంగ్రెస్‌కు ఉన్న బలమైన బంధాన్ని.. 🙌
ప్రజాగర్జన పేరుతో ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. 💪 దీనిలో భాగంగా ఇవాళ చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది.. 📢 తెలంగాణలో ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. 🌍 కనీవినీ ఎరగని తీరులో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. 🎉 చేవెళ్లలోని కేవీఆర్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఈ సభపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. 🌐 సభా ఏర్పాట్లపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పార్టీ నేతలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. 🗣️ ఇవాళ సాయంత్రం 4.50 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే ఈ సభకు ముఖ్య అతిథిగా రానున్నారు. 🎙️ సభలో మల్లికార్జున ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. 📄 మరోవైపు, పేదల నుంచి తక్కువ ధరకు భూములు తీసుకుని ఎక్కువ ధరకు ప్రభుత్వం కపెనీలకు కేటాయించడం దుర్మార్గమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. 🚫 షాబాద్ మండలం చందనవెల్లిలో 1800ఎకరాలు, ఇబ్రహీంపట్నంలో 8వేల ఎకరాలను ప్రభుత్వం పేదల నుంచి బలవంతంగా గుంజుకుందని ఆరోపించారు. 🌳🏛️