top of page
Shiva YT

🔍🏛️తెలంగాణపై కాంగ్రెస్‌ స్పెషల్‌ ఫోకస్‌.. 🧐🌟

ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీలను నియమించింది. 🗳️🧾 ఓ రకంగా ఎన్నికల ప్రకటన రాకముందే.. AICC ఈ కమిటీలను ప్రకటించడంతో ద్వారా ఇక ఎన్నికల బరిలో దిగాలంటూ కేడర్‌కి ఇన్‌డైరెక్ట్‌గా పిలుపునిచ్చినట్టేనని చెప్పొచ్చు. 📢🔍

ముఖ్యంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే.. కాంగ్రెస్ పార్టీ కసరత్తులను పూర్తిచేసింది. 💪🤝 ఎన్నికల రోడ్ మ్యాప్.. హామీలు, టికెట్లు ఇలా ప్రతీ అంశంపై పూర్తిగా ఫోకస్ పెట్టి.. సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటోంది. 💬🗺️ తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు కల్పించడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం కొత్త సందేశం పంపింది. 💼💌 స్క్రీనింగ్ కమిటీల్లో ఏ రాష్ట్రంలోనూ ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు లేరు. తెలంగాణను ప్రత్యేకంగా పరిగణిస్తూ ఉత్తమ్‌కు చోటు కల్పారు. 🌄✍️ ఉత్తమ్ పార్టీ వీడి వెళ్తారంటూ జరిగిన ప్రచారాన్ని పట్టించుకోని అధిష్టానం స్క్రీనింగ్ కమిటీ మెంబర్‌గా చేర్చింది. 📜👔 దీంతోపాటు టికెట్ల విషయంపై ఎవ్వరూ మాట్లాడవద్దంటూ కూడా హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది. 🗣️💼


bottom of page