top of page
Suresh D

బీఆర్ఎస్ అస్తిత్వంపై బలంగా కొడుతున్న తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి!! 🗳️

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసే పనిలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ వేస్తున్న అడుగులు, ఆపరేషన్ ఆకర్ష కేసీఆర్ కు షాక్ ఇస్తున్నాయి.

ఇప్పటికే బీఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అస్తిత్వంపై బలంగా దెబ్బ కొడుతున్నారు. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు మరో నలుగురు ఐదుగురు కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ అగ్ర నేతలు వేగంగా చక్రం తిప్పుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని కాంగ్రెస్ బాట పట్టించే పనిలో పడ్డారు. ముఖ్యంగా బీఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరే అర్థ బలం ఉన్నవారిని లోక్సభ బరిలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది.గ్రేటర్ హైదరాబాద్ లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికలలో అన్ని స్థానాలను కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. 

ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి మాటలు వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేలను, ముఖ్య బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగ సిద్ధం చేశారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే మాజీ మేయర్ మొంతు రామ్మోహన్ పార్టీ లో చేరారు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మరో ఇద్దరు మాజీ మంత్రులు, మరో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయగా ఎన్నికల నోటిఫికేషన్ లోపు వీరు చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలలోపే కేసీఆర్ పార్టీకి చెక్ పెట్టే ప్లాన్ లో ఉన్న రేవంత్ రెడ్డి అదును చూసి కేసీఆర్ పైన, బిఆర్ఎస్ పార్టీ అస్తిత్వం పైన బలంగా దెబ్బ కొడుతున్నారు. 🗳️

bottom of page