భాగ్యనగర ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ తన సేవలను అందిస్తున్న మెట్రో విస్తరణకు రంగం సిద్ధమైంది. ఫేజ్ -2 మెట్రో విస్తరణ రూట్ మ్యాప్‌ను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు అధికారులు. కొత్తగా మరో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. 🚧 మెట్రో విస్తరణలో నాగోల్ నుంచి శంషాబాద్‌కు నిర్మించే రూటే.. అతిపెద్దది కానుంది. 🌆
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. 🗺️ మొత్తం 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. ఆ వివరాలను సీఎంకు అందించారు. 🚄 విస్తరణలో భాగంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు మెట్రో మార్గాన్ని పొడిగించనున్నారు. కొత్తగా మరో నాలుగు కారిడార్లలో నిర్మాణం చేపట్టనున్నారు. 🏗️
కారిడార్ 2 కింద.. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 🚇 అలాగే.. ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు 1.5 కిలోమీటర్ల మేర రూట్ మ్యాప్ రెడీ చేశారు. 🗺️ కారిడార్ 4 కింద.. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు.. 29కిలోమీటర్లు ప్రపోజల్స్ రెడీ చేశారు. 🌐 నాగోల్-ఎల్బీనగర్-చాంద్రాయణగుట్ట-మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో వెళ్లనుంది. 🚁 మరోవైపు మైలార్‌దేవ్‌పల్లి నుంచి హైకోర్టు వరకు 4 కిలోమీటర్ల మేర మరో రూట్ మ్యాప్ రెడీ అయింది. 🗺️
ఇక కారిడార్ 5 కింద.. రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 🏰 రాయదుర్గం- నానక్‌రామ్‌గూడ- విప్రో జంక్షన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 8 కిలోమీటర్ల మేర మరో ప్రపోజల్ సిద్ధం చేశారు. 🏦 వీటన్నింటికీ సీఎం రేవంత్ ఆమోదమే మిగిలి ఉంది. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత.. వెంటనే పనులు మొదలయ్యే అవకాశాలున్నాయి. 🏗️🌇