top of page

ఆరో రోజుకు చేరిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..🏛️💼

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజుకు చేరాయి. అసెంబ్లీలో ఇవాళ పవర్‌ ఫైట్‌ జరుగుతుంది. విద్యుత్‌శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. పదేళ్ల లెక్కలను సభలో డిప్యూటీ సీఎం భట్టి ప్రవేశపెట్టారు. విద్యుత్‌రంగ పరిస్థితులపై ఈరోజంతా స్వలకాలిక చర్చ జరుగుతుంది. ఈరోజు విద్యుత్‌శాఖ వైట్‌పేపర్‌పై అసెంబ్లీ హీటెక్కింది.

అసలు శ్వేతపత్రం అంటే ఏమిటి..? సర్కార్ ఏదైనా ఒక అంశంపై విడుదల చేసే సాధికారిక రిపోర్ట్‌ను లేదా మార్గదర్శక పత్రాన్ని శ్వేతపత్రం అంటారు. అంటే, ఒక అంశానికి సంబంధించిన సమగ్ర వివరాలు, ప్రభుత్వ అధికారిక సమాచారంతో రూపొందించిన వాస్తవ నివేదికే శ్వేతపత్రం. అంతేకాదు, ఏదైనా ఒక అంశంపై గవర్నమెంట్ తన విధానాలను తెలియజేస్తూనే, అభిప్రాయాలను ఆహ్వానించడం కూడా శ్వేతపత్రం ద్వారా చేయవచ్చు. అదే విధంగా ఒక బిల్లును అసెంబ్లీ లేదా ఏదైనా చట్టసభలో ప్రవేశపెట్టడానికి ముందు దాని వివరాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి ప్రజలకు తెలియజేయవచ్చు. 📄💡


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page