top of page

తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం సిద్ధమైంది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ‘అమర దీపం-తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రం’ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేడు (గురువారం) ప్రారంభించనున్నారు.

రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన తెలంగాణ ప్రజలకు ఈ స్మారకం నివాళి. హైదరాబాద్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న లుంబినీ పార్క్ దగ్గరలో ఆరు అంతస్తులతో దీన్ని నిర్మించారు . ఇది 1,600 టన్నుల స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మించారు . ఇది బంగారు రంగులో ప్రమిద జ్యోతి ఆకారంలో ఉంటుంది . స్మారక చిహ్నం 26,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టారు . నేల మట్టానికి 45 మీటర్ల ఎత్తులో , ఒక వైపు 26 మీటర్లు మరొక వైపు 18 మీటర్ల ఎత్తులో ఇది ఉంటుంది. ఈ మెమోరియల్ నిర్మాణ వ్యయం దాదాపు రూ.177.5 కోట్లు. ఇది పార్కింగ్, మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడియోవిజువల్ గది, కన్వెన్షన్ హాల్, రెస్టారెంట్ మరియు వ్యూ పాయింట్ వంటి వివిధ సౌకర్యాలను కలిగి ఉంది. ఈ స్మారకం తెలంగాణ సమాజానికి గర్వకారణం.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page