top of page

మహిళల ఉచిత ప్రయాణంలో ఇబ్బందులున్నాయా.?ఈ నెంబర్‌కు కాల్‌ చేయండి..🚺🚍🤔

టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోందన్నారు.

మహిళల ప్రయాణ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ గొప్ప కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీని భాగస్వామిగా చేసినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 🚌💁‍♀️🌐

మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసి.. వాటిపై 40 వేల మంది సిబ్బందికి అవగాహన కల్పించామని గుర్తు చేశారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ స్థానికతను నిర్థారించుకునేందుకు తమ ఆధార్ కార్డులను సిబ్బందికి చూపించి.. సంస్థకు సహకరించాలని కోరారు. 🏛️💳👩‍👧‍👦

పొరపాట్లు జరిగితే.. ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రవేశపెట్టగానే రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సులను నడిపేందుకు ప్లాన్ రూపొందించామని చెప్పారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు కొంత సమయనం పాటించి.. సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని, 24 గంటలు అందుబాటులో ఉండే సంస్థ కాల్ సెంటర్ నంబర్లైనా 040-69440000, 040-23450033 ఫోన్ చేసి చెప్పొచ్చన్నారు. వాటిని వెంటనే సరిదిద్దుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. 🚍⚠️📞

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page