Telangana Rains: బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు రోజులు రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
నిన్న రాత్రి హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. దంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్ని జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో బండ్లు మునిగిపోయాయి. నాలాలు ఒక్కసారిగా పొంగిపోర్లాయి. మరోవైపు ఈ రోజు జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ, ములుగు, ఖమ్మం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మొత్తంగా తెలంగాణలో వరుణుడు కాస్త గ్యాప్ ఇచ్చి తన ప్రతాపం చూపించబోతున్నట్టు సమాచారం. వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రజలు అప్రమత్తమయ్యారు.