కేసీఆర్ ఇంట్లో తప్ప 24గంటల కరెంట్ ఎక్కడా రావడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. మణుగూరు కాంగ్రెస్ సభలో, వరంగల్‌జిల్లా నర్సంపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక.. ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని.. కేసీఆర్‌లాగా తాము ఉత్త మాటలు చెప్పబోమంటూ స్పష్టంచేశారు. కాంగ్రెస్ తుఫాన్ వస్తోందని.. కేసీఆర్‌కు అర్థమైందని.. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేయబోతోందని రాహుల్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ, ఎంఐఎం సహకరిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్యే యుద్ధం జరుగుతోందంటూ రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చే హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి జరిగిందని.. దళితబంధుకు రూ.3 లక్షలు కమీషన్ తీసుకుంటున్నారంటూ రాహుల్ ఆరోపించారు. 70 ఏళ్లుగా కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారు..కేసీఆర్ చదువుకున్న స్కూల్, కాలేజీ కాంగ్రెస్ ఇచ్చిందేనన్నారు. 500లకే గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామంటూ హామీనిచ్చారు. రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని.. గృహజ్యోతి కింద 200 మెగావాట్ల ఉచిత కరెంట్.. ఇలా 6 గ్యారంటీలను కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామంటూ స్పష్టంచేశారు. 🌐👏